రాజు గారి గది 3 మూవీ రివ్యూ - raju gari gadhi 3 review rating telugu

రాజు గారి గది 3 మూవీ రివ్యూ


ఓంకార్ దర్శకత్వంలో అశ్వీన్ బాబు ,అవికాగోర్ హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం  రాజు గారి గది 3


ఈ సినిమా కథ విషయానికి వస్తే అనాథ అయిన అశ్వీన్(అశ్వీన్ బాబు)ఓ  ఆటో వాలా,ఇతనికి ఓ ఫ్రెండ్ వుంటాడు అతడే ఆలీ ఈ ఇద్దరు కలసి రాత్రంతా తాగి  వీథీలో వారికి నిద్రలేకుండా చేస్తూ సంతోష పడుతుంటారు.
మాయా(అవికాగోర్) ఓ డాక్టర్  మాయాకు ఎవరైన లవ్ ప్రపోజ్ చేస్తే ఓదెయ్యం వచ్చి లవ్ ప్రపోజ్ చేసిన వారిని చావ బాదుతుంది.ఓ సందర్బంలో డాక్టర్ శశి(బ్రహ్మాజీ) మాయకు లవ్ ప్రపోజ్ చేసి దెయ్యం చేత తన్నులు తింటాడు 

డాక్టర్ శశి బాగా ఆలోచించుకొని మాయాకు ఎవరు ప్రపోజ్ చేసిన దెయ్యం కొడుతుందని గ్రహించి ఎలాగైనా తమకు రాత్రంతా నిద్ర లేకుండా చేస్తున్న అశ్వీన్ ను మాయా మీదికి ఉసిగొల్పాలనుకోని కాలని వాసులకు చెబుతాడు అందరు సరే అంటారు.డాక్టర్ శశి పథకం వేసి అశ్వీన్ మాయాకు లవ్  ప్రపోజ్ చేసేలా చేస్తాడు వెంటనే ఆ దెయ్యం వచ్చి అశ్వీన్ ను చితకబాదుతుంది. 

మరుసటి రోజు కాలనీవాసులు అశ్వీన్ తో మాయాకు ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తే దెయ్యం వచ్చి కొడుతుందనే విషయం చెబుతారు 

ఆతర్వాత అశ్వీన్,ఆలీ ఇద్దరు కలసి కేరలలో వుండే మాయా తండ్రి గరడపిళై(అజయ్ ఘోష్)దగ్గరికి వెళ్తారు. గరడపిళై పెద్ద మాంత్రీకుడు ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది,ఇంతకి ఆ దెయ్యం ఎవరు,దెయ్యాన్ని బంధించి అశ్వీన్ మాయాను ఎలా పెళ్ళి చేసుకున్నాడు అన్నదే మిగతా కథ.
రాజు గారి గది 3 చిత్రానికి డివైడ్ టాక్ రావటానికి కారణాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో 

1, సినిమా ప్రారంభం నుంచి మాయా(అవికాగోర్) ను కాపాడుతున్న దెయ్యం గురించి ఏదైనా బలమైన కథ వుంటుందో ఏమోననే విథంగా కథ నడవటం.

2, మాయా తండ్రి అయిన గరడపిళై ను మహా మాంత్రికుడిగా చెప్పటం వలన ప్రేక్షకుడు  కథను ఎక్కువగా ఊహించుకోవటం కొంత సేపటి తర్వాత అతను డమ్మీ మాంత్రీకుడు అని తేలడంతో కథలో బలం తగ్గి కథ కాస్త గాడి తప్పడంతో ప్రేక్షకులు కథతో పాటు ట్రావెల్ కాకపోవడం.

3, గరడపిళై మరియు రాజమాత 3 (సీనియర్ నటి ఊర్వశి) కు మధ్య వచ్చే ఎపిసోడ్ కథకు బలం చేకూర్చక పోవడం.

4, తాళపత్ర గ్రంధాలను వెతుకుతూ క్లైమాక్స్ లో కథను పక్కకు పెట్టి చేసిన హడావిడి హర్రర్ కామెడి తో ప్రేక్షకుడు బోరుగా పీల్ అవడం.

5, మంచి లైన్ తీసుకున్నప్పటికి దర్శకుడు కథను చెప్పిన రీతిలో ప్రేక్షకుడికి సినిమాలో కథ వున్నట్టు అనిపించకపోవడం.

6, మాయాను కాపాడుతున్న దెయ్యం (యక్షి) మాయా తో వుండడానికి చెప్పిన కారణం అప్పటి వరకు నడిచిన కథ ప్రకారం ప్రేక్షకుడికి నచ్చకపోవడం.

7,ముఖ్యంగా ఓంకార్ దర్శకుడు కావడం వలన కథలో ఏదైనా కొత్తధనం,ట్విస్టులు వుంటాయని ప్రేక్షకుడు భావించడం.

ఇదే కథని కాస్త స్క్రీన్ ప్లే మార్చి రాసుకుంటే సినిమా అధ్బుతంగా వుండేది  ఆ వివరాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో 

1, సినిమా ప్రారంభంలోనే  ఓ మాంత్రికుడు తన కూతురిని ఓ బ్రిటీష్ అథికారి నుంచి రక్షింకోవడానికి దెయ్యాన్ని(యక్షి) తన కూతురికి రక్షణగా పెట్టుకోవడం ,ఆ బ్రిటీష్ అథికారిని యక్షి తరిమివేయడం ఆ తర్వాత మాంత్రికుడు యక్షిని ఓ బొమ్మలో బంధించి దానిని పూడ్చిపెట్టడం.

2, కొన్ని సంవత్సరాల తర్వాత ఓ డమ్మి మాంత్రికుడు (గరడపిళై)ఓ ఇంట్లో క్షూద్రపూజలు చేస్తు త్రవ్వకాలు జరపడం అక్కడ డమ్మి మాంత్రికుడికి బొమ్మ దొరకడం ఆ బొమ్మ లో దెయ్యం వున్నదని డమ్మీ మాంత్రికుడికి తెలియక బొమ్మను ఇంటికి తీసుకెళ్ళడం.

3,డమ్మీ మాంత్రికుడు గరడపిళై ఆ బొమ్మను తన కూతురైన మాయా( అవికాగోర్) కు ఇవ్వడం మాయా ఆ బొమ్మకు వున్న శిలను లాగి పడేయటంతో యక్షి (దెయ్యం)బయటికి రావడం.అప్పటి నుండి దెయ్యం మాయాను కాపాడుతుంది అనే విషయం గరడపిళైకు తెలియకపోవడం.

 ఇలా కథనం రాసుకొని  ఇక్కడి నుండి సినిమాలో చూపిన విధంగా కథ నడిపి  వుంటే చాలా బాగా వుండేది.ఒకవైపు ఏమీ చేయలేని డమ్మి మాంత్రికుడు, మరో వైపు డమ్మి రాజమాత3 వీరి మధ్యన అశ్వీన్,ఆలీ వీరంతా కలసి మాయా నుంచి యక్షి(దెయ్యం)ను ఎలా వేరుచేసి బంధించారు అనే విథంగా కథ,కథనాలు మలచివుంటే రాజు గారి గది3  సినిమా చాలా బాగుండేది.ప్రేక్షకుడు ఎక్కువగా ఆలోచించకుండా ,కథ నుంచి బయటికి రాకుండా చక్కగా ఎంజాయ్ చేసేవాడు 

ప్రతీసారి కొత్త కథలు దొరకవు కనుక దొరికిన మంచి కథలను కన్ఫ్యూజన్ చేయకుండా, ఇంట్రేష్టింగ్ గా చెబితే బాగుంటుంది.

ఇది కేవలం నా అభీన్రాయం మాత్రమే నా అభీప్రాయం ఎలావుందో అర్థం కావాలంటే రాజు గారి గది 3 సినిమా చూడండి.


రివ్యూ రైటర్ :  మీర్జా అజీజ్

English Version

Raju Gary Room 3 Movie Review


Ashwin Babu directed by Omkar, Avicagoor starring heroine


When it comes to the story of the film, the orphanage (Ashwin Babu) is an auto wala and he has a friend. He and Ali get drunk all night and make them sleep on the streets.

Maya (Avicagore) A Doctor Maya Who Loves Prophesying Love Comes To The One Who Proposes Love And Dr Shashi (Brahmaji) Proposes Love To Maya

Dr. Shashi is very well thought of as the devil who proposes to Maya, who is not sleeping all night.

The next day, the colonists tell Ashwin that the devil will come if anyone proposes magic for magic

Subsequently, Ashwin and Ali will be moving to a close-knit father-in-law, Garadapilai (Ajay Ghosh). Garadapilai is a big magician and what happened then, who is the ghost, how to capture the ghost and marry Ashwin magic is the rest of the story.


Reasons Why Divide Talk For The King Gary Room 3 In My Point Of View

1, from the very beginning of the film, there is a strong story about the ghost who has been protecting the Maya (Avicagor).

2, the magician's father, Garadapillai, is a great wizard, so the viewer is more likely to assume that the story is a dummy sorcerer.

3, the episode between Garadapilai and Rajamatha 3 (senior actress Urvashi) does not add strength to the story.

4, the viewer is bored with a horror comedy that has clipped the story in climax looking for pamphlets.

5, the fine line is taken and the director does not seem to have a story in the film as the director tells the story.

6, the reason why the ghost (Yakshi) who protects the magic is told to be with the magic is that the viewer does not like it according to the story that ran until then.

7, especially since Omkar is the director, the viewer feels that there is a new twist and twist to the story.

If you can write the same story with a little screenplay, the film would be fantastic in my point of view

1, at the beginning of the film, a magician protects his daughter from a British spy to protect her daughter from the devil (yakshi), and the British sorcerer is chased away by a demon and then buried in a toy.

2, a few years later a dummy wizard (Garadapillai) is conducting an excavation at a house where a dummy wizard has a toy that the ghost does not know is present in the house.

3, the dummy wizard Garadapilai hands the doll to his daughter Maya (Avicagor) as the magician pulls out the rocks of the toy and the yakshi (ghost) comes out.

 On the other hand, the dummy wizard on the other hand, the dummy sorcerer on the other hand, and Dummy Rajamatha on the other hand, Ashwin and Ali together with the story of how the Yakshi (ghost) was seized from the magic and the story as a king. The room 3 movie is great. The viewer is very entertained without thinking too much. Would

Every time you find new stories, it's good to find good stories that are intrusive, not confusing.

Watch King Gary Room 3 Movie if you want to understand how this is my only wish.


Review Writer: Mirza Aziz
Previous
Next Post »