RDX Love Movie Plus Minus Review | RDX Love Telugu Review By Happy Edits

RDX Love Movie Plus Minus Review  RDX Love Telugu Review By Happy Edits

RDX Love is a film that has been promoted as virally and a lot with some spicy posters and videos featuring Payal Rajput. The film has finally hit the screens today.

RDX LOVE మూవీ రివ్యూ:

తేజుస్, పాయల్ రాజ్ పుత్ జంటగా శంకర్ భాను దర్శకత్వంలో నటించిన చిత్రం RDX LOVE ఈ చిత్ర కథ విషయానికి వస్తే అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఉండే ప్రజలు చదువుకోవాలన్న,హాస్పిటల్ కు వెళ్ళలన్న చాలా కిలో మీటర్లు ప్రయాణించవలసిన పరీస్థితి.ఆ ప్రజలు వుండే ఊరికి కొంత దూరంలోనే అన్ని వసతులు వుండే ఊరు వుంటుంది కాని ఆ వూరికి చేరుకోవాలంటే మధ్యన వున్న  నదిని దాటి వెళ్ళాలి.

ఆ ఊరికి ఈ ఊరికి మధ్య వంతెన నిర్మాణం జరిగితే తమ బాధలు తొలిగిపోతాయని భావించి అందరు కలసి ప్రభూత్వ అధికారులను కలుస్తారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళ బాధని అర్థం చేసుకోరు.ఏం చేయాలో అర్థం కాక  ఊరిలో వున్న ప్రజలు అందరు కలసి ఓ నిర్ణయం తీసుకోని సీతారాములు,లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాల దగ్గరికి వెళ్ళి సీతారాములను విడదీస్తారు.రాముడు,లక్ష్మణుడు,హనుమంతుల విగ్రహాలను తీసుకొని వెళ్ళి నది అవతలి వైపున పెట్టి సీతమ్మ కోసం ఆనాడు లంకకు వారధి కట్టి వెళ్ళావు ఈనాడు మళ్ళీ వారధి కట్టి మావూరిలో వున్న సీతమ్మ దగ్గరికి రావాలని రాముడికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.  

కొన్ని సంవత్సరాల తర్వాత అలివేలు( పాయల్ రాజ్ పుత్) సేఫ్ సెక్స్ పాటించకపోవడం,
గుట్కా తినడం,సారాయి తాగడం వలన కలిగే నష్టాల గురించి ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభూత్వం దృష్టిని ఆకర్షించి ముఖ్యమంత్రి గారి అపాయింటుమెంట్ సంపాదించి తమ ఊరి సమస్యను గురించి తెలిపి వారధి కట్టించుకోవాలనుకోవడం,ఈ క్రమంలో ప్రముఖ టీవీ చానల్ ఓనర్ కుమారుడు సిద్థు(తేజుస్) అలివేలు తో ప్రేమలో పడడం,తన కొడుకుని అలివేలు ప్రేమ నుంచి కాపాడుకోవాలని సిద్థు తండ్రి అలివేలును చంపాలనుకోవడం,ఆ పరీస్థితులను ఎదురించే క్రమంలో సిథ్థు తండ్రి చెప్పిన షరతులను ఒప్పుకోవటం,సిద్థు తండ్రీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తన దగ్గరున్న నిజాలు బయట పెడతానంటు బెదిరించి వంతెన నిర్మాణం జరిగేలా చూడటం జరుగుతుంది.

చివరకు  వంతెన నిర్మాణం పూర్తి అయ్యాక 
రాముడు,లక్ష్మణుడు,హనుమంతుని విగ్రహాలను  తమ ఊరికి తీసుకెళ్ళి సీతమ్మ దగ్గరికి చేరవేయడంతో కథ ముగుస్తుంది.




RDX LOVE సినిమాలో జరిగిన కొన్ని పొరపాట్లు నా పాయింట్ ఆఫ్ వ్యూలొ:-

1,  సీతారాములను విడదీసిన తరువాత సీతారాముల కథ  సినిమాలో కనిపించక పోవటం,ఎక్కడ కూడా సీతారాముల ప్రస్తావన రాకపోవడం.

2,  ముఖ్యమంత్రి అపాయింటుమెంట్ కోసం అలివేలు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమం అతిగా అనిపించడం.

3, ఆ ఊరిలో ఎంతో మంది యువకులు కూడా ఉండగా అయిదుగురు అమ్మాయిలు మాత్రమే సిటికి వచ్చి వారధి కట్టించడానికి ప్రయత్నించడానికి సరియైన కారణం లేక పొవడం.

4,  సిద్థు క్యారెక్టర్ అలివేలును ప్రేమించటానికి మాత్రమే అన్నట్లు చూపించడం.

5, వారధి కట్టించమని అడిగిన ఊరి ప్రజలను  కారుతో గుద్ది చంపిన వ్యక్తి ముఖ్యమంత్రి అని తెలిసిన కూడా అపాయింటుమెంట్ కోసం ప్రయత్నించటం.

6,  అలివేలు టీం ద్వారా చైతన్య పరచబడిన ప్రజల చేత వారధి కట్టే  విషయంలో సపోర్ట్ గా నిలబడక పోవడంతో ఆ ఎపిసోడ్స్ అనవసరంగా ఉన్నట్లు అనిపించడం.

7,  వంతెనను నిర్మించేలా చేయాలన్న ఆలోచనతో,సిద్థు తండ్రిని గెలవాలన్న ఆలోచనతో అలివేలు సిద్థుకు అర్పించిన అందాలు కూడా కథలో బలహీనంగా మారడం.

దర్శకుడు తీసుకున్న స్టోరీలైన్ బాగుంది కాని దానిని డెవలప్ చేసే క్రమంలో కథనం బలహీనంగా మారినట్లు అనిపిస్తుంది.




ఈ కథలో కొన్ని మార్పులు చేస్తే కథ అధ్భూతంగా వుండేది 
ఆ వివరాలు(నా పాయింట్ ఆఫ్ వ్యూలో) :-

1) సీతారాములను విడదీసే క్రమంలో సీతా దేవి విగ్రహంతో ఓ అయిదు కుటుంబాలు ఊరు విడిచి వెళ్ళిపోయి పట్టణంలో బ్రతుకుతూ సీతాదేవితో రాముడు వస్తాడు వారధి కట్టి నిన్ను, మమ్ముల్ని తిరిగి మన ఊరికి తీసుకెళ్తాడు.అనే విథంగా కథను ప్లాన్ చేసుకుంటే ఆ అయిదు కుటుంబాలలో ఆడ సంతానమే వుండటం వలన ఆ అయిదుగురు అమ్మాయిలు టీంగా ఏర్పడి  సిటిలో ప్రజలను చైతన్య పరుస్తూ వుండేలా వుంటే బాగుండేది.

2) టీవి చానల్ ఓనర్ కుమారుడైన సిద్థు తన చానల్ కథనాలను చిత్రీకరించడానికి  ఓ ఊరికి వెళతాడు. అక్కడ
సీతమ్మ లేకుండా వున్న రాముడు,లక్ష్మణుడు,
హనుమంతుని విగ్రహాలు చూసి సీతమ్మ విగ్రహం లేకపోవడంతో  జరిగింది తెలుసుకొని, అలివేలు వాళ్ళ దగ్గరికి వచ్చి కలిసి,సీతమ్మ విగ్రహాన్ని చూసి వారధి కట్టడానికి తన వంతు సహాయం చేస్తానని మాట ఇస్తాడు.
అలివేలు ను ప్రేమించడం మొదలు పెడతాడు.

3) అలివేలు టీం చేసే పనులను తన టీవిలో ప్రసారం అయ్యే విధంగా చేయడంతో ముఖ్యమంత్రి గారు చూసి  ఈ టీంను కలవాలనుకుంటారు.టీంను కలిసిన ముఖ్యమంత్రి గారు వంతెన నిర్మించటానికి వీలు కాదని ఆ ఊరిలో ఓట్లు కూడా ఎక్కువగా లేవని చెప్పి పంపిస్తాడు.అలివేలు టీం తాము చైతన్య పరిచే జనం సహాయం తీసుకోవాలని భావించి అందరికి తమ ఊరి సమస్య చెప్పి వారధి కట్టించటానికి ప్రభూత్వాన్ని నిలదీసే విథంగా కథ రాసుకొని వుంటే బాగుండేది. 

4) సిద్థూ అందరి సహకారంతో ప్రభూత్వం మెడలు వంచి వారధి కట్టేలా చేసి  సీతమ్మను,ఆ అయిదు కుటుంబాలను  తిరిగి ఆ ఊరికి చేర్చడంతో కథ ముగిసివుంటే బాగుండేదని నా వ్యక్తిగత అభీప్రాయం.


ప్రతీ సినిమా బాగుండాలి అనేది మా ఆకాంక్ష. 

నా రివ్యూ అర్థం కావాలంటే RDX LOVE సినిమా చూడండి.

(ఇది కేవలం నా వ్యక్తి గత అభీప్రాయం మాత్రమే గమనించగలరు)


రివ్యూ రైటర్ : మీర్జా అజీజ్
Previous
Next Post »