ఇలాంటి ఎన్నికలు ఎప్పుడొస్తాయో - election commission

ఇలాంటి ఎన్నికలు ఎప్పుడొస్తాయో
ఎన్నికల  సమయంలో ఏం చేయాలి?

భారతదేశానికి  అగష్ట్15, 1947 రోజున   స్వాతంత్ర్యం వచ్చింది.స్వాతంత్ర్యం వచ్చిన  తరువాత లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని రూపొందించుకొని,భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ  దేశాన్ని అభీవృద్ది చెందేలా ప్రణాళికలు రూపొందించుకొని దేశంలో పరిపాలనను మన నాయకులు కొనసాగిస్తున్నారు.ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒప్పుకోవలసిన  గొప్ప విషయం.

ఇక విషయానికి వస్తే మా నాన్న గారు చిన్నప్పుడు స్కూల్లో  భారతదేశం అభీవృద్ది చెందుతున్న దేశం అని చదువుకున్నారట

కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్ లో నేను కూడా భారతదేశం అభీవృద్ది చెందుతున్న దేశం అనే చదువుకున్నాను.

ప్రస్తుతం నా పిల్లలు కూడా భారతదేశం అభీవృద్ది చెందుతున్న దేశం అనే చదవుకుంటున్నారు.
ఇంకా ఎన్ని తరాలు ఇలానే చదవాలి భారతదేశం "అభీవృద్ది చెందినదేశం"
 అని చదివే రోజులు ఎప్పుడు వస్తాయి?.

ఇలా ఆలోచిస్తే నాకు అనిపించిన విషయం ఒక్కటే
భారతధేశ పరిపాలన వ్యవస్థలో రాజకీయ నాయకులకు,ఉద్యోగులకు చివరికి దేశ ప్రజలకు వున్న లోపం భాధ్యతా రాహిత్యం.

భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వ్యక్తిగత హక్కులను, స్వేచ్ఛలను  కలిగించింది.వ్యక్తులు స్వేచ్ఛను,హక్కులను కలిగివుండడం మంచిదే కాని అవే హక్కులు దేశ అభీవృద్దికి ఆటంకం కలిగించినట్లయితే వాటిని క్రమశిక్షణతో,భాధ్యతతో అమలు జరిగే విధంగా చూడటం కూడా భారత ప్రభూత్వానికి అవసరం.

ఈ విషయం అందరికి అర్థం అయ్యే విధంగా చెప్పాలంటే 
భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వుంటుంది.
దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించబడుతుంటాయి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 100శాతం ఓటింగ్ ఎప్పుడు కూడా జరగలేదు.

ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బు,మద్యం మాత్రమే ఓటింగ్ శాతంను శాసిస్తున్నాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.

 సామాన్య ప్రజలు ఎన్నికలలో పోటి చేసే అవకాశం రాజ్యాంగం కల్పించిన వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భీన్నంగా వున్నాయి.రాజకీయ నాయకులు ఎన్నికలను పేద ప్రజలకు అందనంత దూరంలో పెట్టారు.డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికలలొ గెలిచే అవకాశం లేదు ఈ పరీస్థితి మారాలి దేశాన్ని అభీవృద్ది దిశగా తీసుకెళ్ళగలిగిన ప్రతి ఒక్కరు రాజకీయాలోకి వచ్చే విధంగా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి లేకుంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలవడానికి డబ్బును విఛ్ఛలవిడిగా ఖర్చు పెట్టడం,గెలిచిన తర్వాత వారు పెట్టిన డబ్బు సంపాదించుకోవటానికి చూడటం ఇదే జరుగుతుంది తప్పా అభీవృద్ది జరగడం లేదు.

దేశంలో అభీవృద్ది జరగాలంటే ఓటర్ డబ్బుకు,మధ్యంకు విలువ ఇవ్వకుండా ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలి.కాని ఇలా జరగడంలేదు కాబట్టి ఎన్నికల సంఘం,మన ప్రభూత్వాలు కలసి కొత్తగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనావుంది.

ఆ చర్యలు ఎలా వుండాలో ఉదాహారణ:

1, ప్రతి ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోగానే ఎన్నికల సంఘానికి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు మెసేజ్ వెళ్ళాలి.

2, ఎన్నికల సమయంలో హాస్పిటల్ లో,జైల్ లలొ వుండి ఓటు హక్కు వినియోగించుకోలేని వారి వివరాలు కూడా నమోదు అయ్యేలా ఏర్పాట్లు చేయాలి.

3, ఓటు హక్కును వినియోగించుకోని వారికి ఎటువంటి ప్రభూత్వ పథకాలు అమలు కాకుండా చేయాలి,ఇలా చేయడానికి పైన చెప్పబడిన పద్దతులు పనికి వస్తాయి.

4, ఓటు హక్కును వినియోగించుకోని వారికి శిక్ష లేదా అపరాధ రుసుము వేయాలి.తద్వారా ఓటును అమ్ముకోవడానికి చూడకుండా బాధ్యతతో ఓటు వేస్తారు.

5, ఎన్నికలలో నిలబడిన వారు ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా ఎన్నికల ప్రచారం  చేసుకునేలా,
మున్సిపాలిటి,
నగరపంచాయితి,
గ్రామపంచాయితి మరియు ప్రభూత్వ ఆఫీసులలో  మాత్రమే ఎన్నికల పోస్టర్స్ వేసేలా చూడాలి.

6, ముఖ్యంగా ఓటర్ డబ్బు కోసం చూడకుండా ఓటు వేసే విధంగా క్రమశిక్షణతొ కూడిన భయాన్ని ఓటర్ కు కల్గించాలి.

 ప్రభూత్వము  మరియు ఎన్నికల సంఘం   కలిసి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే దేశం  తప్పక అభీవృద్ది చెందుతుంది.

మనదేశంలో ఎంతో మంది  ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వున్నారు వారి సహాయం,సలహాలు తీసుకుంటే ప్రతీ వ్యవస్థలో  మార్పు తీసుకరావచ్చు ఆలోచించండి 

దేశం కోసం,దేశ అభీవృద్ది కోసం ప్రజలకు భయంతో కూడిన క్రమశిక్షణ నేర్పడం తప్పు కాదు.
త్వరలోనే భారతదేశం అభీవృద్ది చెందిన దేశం అని స్కూల్లో పిల్లలు చదువుకోవాలని కోరుకుంటున్నాను


( నా ఆలోచనలు,అభీప్రాయాలు, రివ్యూలపై  మీ అభీప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు.)

NEXT నేను రాసుకున్న "జూనియర్ గాంథీ"కథతో మళ్ళీ కలుద్దాం........


ఇట్లు,
ఒక ఇండియన్ 
మా అప్ డేట్స్ నీ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఫాలో బటన్ పై క్లిక్ చేయగలరు


English Version

What to do during the election?

India came to on August 15, 1947. After independence, our leaders are continuing to govern the country by creating a written constitution and following the constitution of India.

When it comes to our father's school, India is a developing country.

A few years later in school I also studied India as a developing country.

My children are also studying that India is a developing country.
How many more generations should read "India"
 When are the days of reading?

This is the only thing that made me think
The lack of accountability of the politicians and employees of the in the end is the lack of accountability.

The gives everyone individual rights and freedoms. It is good for people to have freedom and rights but if such rights impede the development of the country, they need to be disciplined and accountable.

This is to say that the subject is understandable to all
In India, everyone who is 18 years old has the right to vote.
are held every five years in the country. Since independence, there has never been 100 percent voting.

Everyone knows that in the current situation, only money and alcohol dictate the voting percentage.

 The real circumstances of the constitution are completely different. This is not something that is being developed by politicians who spend their money in order to win elections and make money after winning.

In order for the country to progress, the voter must exercise their right to vote, not to value the money and the center.Examples of how those actions should look like:

1, every voter exercises his or her right to vote.

2, Arrangements should also be made to register the details of those who are in jail, in jail, or in non-voting during the election.

3, For those who are not exercising their right to vote, no enlightenment schemes should be implemented but the above methods will work.

4, those who do not exercise their right to vote shall be punished or fined.

5, those who stand in the election to campaign for election without inconvenience to others;
Municipal,
Nagarapancayiti,
Election posters should be seen only in Gram Panchayat and Prabhupada offices.
6, especially the fear of being disciplined so that the voter can vote without looking for money.
 The nation and the electoral community must make good decisions and the country must prosper.
There are so many engineering students in our country, with their help and advice, every system can change
For the country, it is not wrong to teach people fearful discipline for the betterment of the nation.
I would like to get the children to school in India as soon as India is a developed country
(I can comment your thoughts, opinions and reviews in the form of a comment.)
NEXT Let me meet you again with the story of "Junior Gandhi" ........


Previous
Next Post »