పేదోడి దీపావళి - Diwali 2019

పేదోడి దీపావళి -పండగలు వస్తున్నాయి,వెళ్తున్నాయి

ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరము కూడా దీపావళీ పండగ వచ్చేసింది.ప్రతీ చోట దీపావళి పండగ చేసుకోవటానికి ఎవరి తాహాతకు తగ్గట్లు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటుంన్నారు.

ఈ దీపావళి పండగ పూట రెండు రకాల మాటలు ఎక్కువగా వినబడుతున్నాయి అవేమిటంటే


1, కొందరు దీపావళీ పండగ పూట కాల్చే బాణాసంచా వలన పర్యావరణానికి ప్రమాదం అని తమ భావాలను వ్యక్తపరుస్తున్నారు.

2, మరి కొందరు పర్యావరణానికి ప్రమాదం బాణాసంచా వలనే జరిగిందా? మనం రోజు వాడే వెహికిల్స్ వలన కలగడం లేదా,ప్లాస్టీక్ వలన కలగడం లేదా అంటూ తమకు తోచింది చెబుతున్నారు.

ఇక్కడ గమనించదగిన విషయాలు ఏమిటంటే ఈ రెండు రకాల అభీప్రాయాలు కూడా నిజమే.
 పర్యావరణ పరిరక్షణకు ప్రమాదం పండగల పూటే కాదు ప్రతీరోజు కూడా జరుగుతుంది ఇది అందరు ఒప్పుకోవలసిన విషయమే అందరికి తెలిసిన విషయమే కానీ ఎవరుకూడా పాటించడం లేదు 

ప్రతీ పని వెనుక ఒక మంచి,ఒక చెడు వుంటాయి.సగటు మనిషి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ బ్రతికే సంథర్బంలో తెలసి కూడా కొన్ని తప్పులు చెయ్యక తప్పదు 

ఉదాహారణకు:- ప్లాస్టిక్ ను  వాడడం,సిగరేట్స్ త్రాగడం,మందు తాగడం,రోడ్ల పై నిబంధనలు పాటించక పోవడం వంటివి వీటిలో కొన్నింటి వలన పర్యావరణానికి ప్రమాదం అయితే మరికొన్ని మనుషులకు ప్రమాదం.

సంవత్సరానికి ఒకసారి జరుపుకొనే దీపావళీ పండగ పూట ఒకరిని ఒకరు నిదించుకోవటం కన్నా దీపావళీ పండగను ఆనందంగా జరుపుకుంటూనే ఈ సంవత్సరం కాల్చిన బాణాసంచా కంటే వచ్చే సంవత్సరం కొద్దిగా తగ్గించి కాల్చుకోవాలనీ నిర్ణయించుకుంటే మెళ్ళమెళ్ళగా మనం మన అలవాట్లను తగ్గించుకుంటూ దీపావళీ పండగను కేవలం దీపాలతో జరిపే రోజు కూడా వస్తుంది. దీని వలన  మన అలవాట్లను చూసి పిల్లలు కూడా నేర్చుకునేందుకు దోహదపడుతుంది.మన అందరికి పండగలు అవసరమే దానితో పాటు ఆనందం అవసరమే.

కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాల అలవాట్లకు అలవాటు పడిన జనం ఒక్కసారిగా మారడం కష్టం ఇది అందరూ గమనించి పండగ పూట ఎవరిని కూడా బాధ పెట్టకుండా వుండటానికి ప్రయత్నం చేయాలి.

మరోక చిన్న విషయం మన చుట్టూ వున్న వారిలో ఎంతో మంది పేదరికం వలన పండుగలుకూడా జరుపుకోలేని పరీస్థితిలో వుంటారు.ఈ దీపావళీ పండగ పూట వారి పిల్లలు సంతోషంగా వుండటానికి మీరు కాల్చుకునే బాణాసంచాలో ఒకటో ,రెండో వారికి ఇచ్చి వారితో కాల్పించండి మిమ్ములను వారు ఆ సంవత్సరం మొత్తం గుర్తు పెట్టుకుంటారు.పండగ పూట వారు కూడా ఆనందంగా వుంటారు.

ఎవ్వరు ఎక్కడ దీపావళీ పండగను జరుపుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని పిల్లలకు చెప్పండి.నిర్లక్షంగా బాణాసంచా కాల్చడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా వుంది.

ఈ పండగ పూట మీరు కాల్చే బాణాసంచా వలన పర్యావరణానికి ఎంతోకొంత ప్రమాదం జరుగుతుంది అని మీకు అనిపిస్తే ఒక్కోక్కరు ఒక్కోక్క మొక్కను నాటండి ఆ మొక్కలే పెరిగి చెట్లుగా మారుతూ మనం బతకటానికి  ప్రాణవాయువు(ఆక్సిజన్)ను అందిస్తాయి.

 మన వలన పర్యావరణానికి కలిగిన ముప్పును వీలైనంత వరకు తగ్గిచవచ్చు.

 వచ్చే జనరేషన్  వాళ్ళు ఆనందంగా బ్రతకాలంటే ఇప్పుడు మనం  చెట్లను పెంచడం అవసరం.ప్రతీ పండుగకు మొక్కలు నాటుతూ వాటిని కాపాడుతూ వుంటే ఆ మెక్కలే మనల్నీ కాపాడతాయి.

దీపావళీ పండగను మీరు మీ కుటుంబ సభ్యులతో,మీ చుట్టు ప్రక్కల వున్న ఇరుగు పొరుగు వారితో కలసి ఆనందంగా  జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికి హ్యాపీ దీపావళీ.


ఇట్లు : మీర్జా అజీజ్

English Version

Diwali - Festivals are coming and going

Like every year, Diwali is celebrated this year. Every year, people are making arrangements to celebrate Diwali.

There are two kinds of words being heard during Diwali

1, some express their feelings that the fireworks burning during Diwali is a danger to the environment.

2, Are some of the environmental hazards caused by fireworks? They say that we are suffering from the vehicles we use today or the plastic ones.

What is noteworthy here is that these two types of assumptions are also true.
 Environmental protection is not the only danger that happens every day It is a matter of public acceptance but not of anyone

There is a good and a bad behind every work.

For example: use of plastics, drinking cigarettes, drinking drugs and not adhering to road rules are some of the hazards to the environment but to some people.

If we decide to burn a little bit more next year than fireworks this year, rather than having to hold each other at the annual Diwali celebration, we have to reduce our habits to light the day of Diwali. This helps our children to learn about our habits.

People who have been accustomed to all kinds of habits for a few years are difficult to change at once.

Another small thing is that many of those around us are on the verge of not being able to celebrate festivities due to poverty. Give them one or two of these fireworks that you can use to make their children happy during Diwali. They will remember you all year long.

Wherever you celebrate the Diwali festival, take appropriate precautions and tell your children.

If you feel that the fireworks you burn during the festival pose a great risk to the environment, plant each one of the plants and turn them into trees and provide oxygen for us to survive.

 We can reduce the threat to the environment as much as possible.

 Now we need to plant trees if the next generation wants to live happily.

Happy Diwali to all of you as you wish to celebrate the Diwali festival with your family and neighbors around you.


These are: Mirza Aziz
Previous
Next Post »