Chanakya Review by Azeez | Chanakya Movie Review 2019 | Happy Edits



 చాణక్య మూవి రివ్యూ:

గోపిచంద్, మెహరిన్,జరీనాఖాన్ ముఖ్య తారాగణంగా తిరు దర్శకత్వంలో వచ్చిన చాణక్య సినిమా కథ విషయానికి వస్తే రా ఏజెంట్ ఐన అర్జున్ (గోపిచంద్) తన స్నేసితులతో కలసి సీక్రేట్ ఆపరేషన్ నిర్వహించి ఓ టెర్రరిస్ట్ ను పట్టుకుంటారు.అతడిని కోర్ట్ కు అప్పగించటం ఇష్టం లేని అర్జున్ తన స్నేహితులతో కలసి కోర్ట్ కు తీసుకెళ్ళే సమయంలో అటాక్ చేసి చంపేస్తారు.

టెర్రరిస్ట్ నాయకుడు ఖురేషి కోపంతో అర్జున్ స్నేసితులను కిడ్నాప్ చేయడం వారితో భారీ కుట్ర చేయించి ప్రపంచ దేశాల ముందు దోషిగా భారత్ ను ఉంచాలనుకుంటాడు.

స్నేహితులను కాపాడటానికి అర్జున్ పాకీస్తాన్ వెళ్ళి అక్కడున్న రా ఏజెంట్ జుబేదా సహాయంతో టెర్రరిస్ట్ లతో పోరాడి స్నేహీతులను కాపాడుకుంటాడు.
 టెర్రరిస్ట్ నాయకుడి కొడుకును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కథ ముగుస్తుంది.ఈ కథతో సంబంధం లేకుండా హీరో హీరోయిన్ ఎపిసోడ్ ఒకటి నడుస్తుంది.

చాణక్య సినిమా పరాజయం పొందడానికి నా యెక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కారణాలు:-

1,ఏ కారణం లేకుండా రా ఏజెంట్ అయిన అర్జున్ బ్యాంక్ ఎంప్లాయ్ గా ఉద్యోగం చేయడం.

2,అత్యంత తెలివి గలవాడైన రా ఏజెంట్  అర్జున్ తన స్నేహితులు కిడ్నాప్ అవుతారనే విషయాన్ని గమనించకపోవడం.

3,స్నేహితులు కిడ్నాప్ అయిన వెంటనే అర్జున్ కు తెలిసిన కూడా టెర్రరిస్ట్ లు వారిని పాకిస్తాన్ తీసుకెళ్ళే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం.

4,ప్రతీదేశం తమ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను వాడుతున్నా భారత్ లో టెర్రరిస్ట్ లకు సంబందించి కాని, పాకిస్తాన్ లో అర్జున్ కు సంబందించి గాని సీసీ టీవి కోణంలో ఆలోచించి ఎవరు గుర్తు పట్టక పోవడం.

5, పాకీస్తాన్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ కు వెళ్ళీ సులువుగా డాటాను అర్జున్  దొంగలించడం, టెర్రరిస్ట్ లు ఇండియాలోకి రహస్యంగా రావడం ,పోవడం, అదే విథంగా అర్జున్ పాకిస్తాన్ లోనికి రహస్యంగా వెళ్ళడం,రావడం అనేవి వాస్తవికతకు దూరంగా వుండటం.

6, ప్రపంచ దేశాల ముందు భారత్ ను దోషిగా నిలబెట్టాలనే టెర్రరిస్ట్ లా ఆలోచనకు భిన్నంగా ప్రపంచ దేశాల ముందు పాకీస్తాన్ టెర్రరిస్ట్ లను దోషులుగా నిలబెట్టలేక పోవడం.

7, కథలో ఎమోషన్ష్ గాని, టోటల్ సినిమా పరంగా ఆర్ ఆర్ గాని అలరించక పోవడం,కథకు తగ్గ పాటలు లేక పోవడం కూడా మరో కారణం.
Chanakya Review by Azeez


ఈ కథలో కొన్ని మార్పులు చేస్తే సినిమా హిట్ అయ్యేది ఆ వివరాలు:-


ఈ కథను ఈ కథనంతో కాకుండా బ్యాంక్ ఎపిసోడ్ ను కథకు లింక్ అయ్యే విథంగా రాసుకొని, స్నేహితులు కిడ్నాప్ అయ్యే విషయం తెలుసుకునేలోపే టెర్రరిస్ట్ లు అర్జున్ స్నేసితులను కిడ్నాప్ చేసి దేశం దాటించాలని చూస్తే అర్జున్ తన తెలివితేటలతో వారిని దేశం దాటనివ్వకుండా చేసి వారిని పట్టుకొని స్నేహితులను రక్షించుకొని అందరు కలసి పాకిస్తాన్ లోని తమ రా ఏజెంట్ జుబేదా సహాయంతో టెర్రరిస్ట్ లా కుట్రను భంగం చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ప్రపంచ దేశాల ముందు పాకీస్తాన్ టెర్రరిస్ట్ లను దోషులుగా నిలబెట్టినట్లయితే సినిమా అథ్భూతంగా వుండేది అనేది నా వ్యక్తి గత అభీప్రాయం

కథలోని చిన్న చిన్న పొరపాట్లు సరిచేసుకోకపోవడంతో విజయం సాధించవలసిన ఈ సినిమా  అపజయం వైపు పరుగులు పెట్టింది.కథను కరెక్ట్ గా ఢీల్ చేసివుంటే గోపిచంద్ గారి కెరీర్ లో బెస్ట్ మూవీ అయి వుండేది.

ఈ అభీప్రాయం కేవలం నా వ్యక్తిగతం మాత్రమే గమనించగలరు.

(నా రివ్యూస్ అర్థం కావాలంటే చాణక్య మూవీ చూడండి .మూవీ లవర్సే కాదు మూవీ మేకర్స్ కూడా చదవదగిన రివ్యూ నాది)

రివ్యూ రైటర్ : మీర్జా అజీజ్
Oldest